Sunday, October 17, 2010

ముందు మాట

నా మనసులో ఉన్న భావాలని, ఆలోచనలని,ఇష్టాలని,బాధ ని పంచుకోవటానికి ఈ బ్లాగ్  ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను...ఎందుకంటే ప్రతి మనిషికి మనసుని తేలిక చేసుకోవటానికి తన మనసు తెలిసిన ఒక మనసు కావాలి....కాని అందరు అదృష్టవంతులు కాదేమో అనిపిస్తుంది.... ఎందుకంటే కొంతమంది కి పంచుకున్న వాటిని వినే మనసు లేక బాధ పడుతుంటే..ఇంకొంత మంది, అలా మనస్పూర్తిగా పంచుకోవటానికి ఉన్న మనసుని ఏదో ఒక సమయం లో ఒక చిన్న అబద్దం తో మోసం చేస్తూ ఉంటారు....ఆ అబద్దం, అబద్దం గా నా స్నేహం మనసులో నాటుకుపోకూడదని..  నిజం చెయ్యాలనే అనిపించినా... చెయ్యలేని నిస్సహాయ స్తితిలో ఉన్న నన్ను నేను చూసుకుంటే చాల జాలి , కోపం వస్తున్నాయి.... నా అబద్దం ..మా మధ్య  ఉన్న స్నేహానికి  ముళ్ళు  గా మారకూడదని  ఆ దేవుడిని ప్రార్ధిస్తూ ...మా ఇద్దరి మనసులకు పెళ్లి అనే బంధం తో ముడివేయ్యాలని ఆ దేవుడికి  మ్రొక్కుతూ ... విజయ దశమి  రోజున ఈ బ్లాగ్ ని ప్రారంభిస్తున్నాను...

No comments:

Post a Comment